Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం వసుదైక కుటుంబం పురాణకాలం నుండి ఆచార సంప్రాదాయలకు పుట్టినిల్లు.అటువంటి ఆచారాలలో మనం పాటించే వాటిలో పండుగలు ముఖ్యమైనవి.అలాంటి పండుగలలో దీపావళి ఒకటి. జగతిని జాగృత పరచే చైతన్యదీప్తుల శోభావళి దీపావళి.
ఈ దీపావళి పండుగ ఆశ్వీయుజ మాసం చతుర్దశి నాడు నరక చతుర్దశిగా మరుసటి దినం అమవాస్యనాడు దీపావళిగా జరుపుకుంటారు. ద్వాపరయుగం నుండి ఈ పండుగ జరుగుతుంది. పండుగ పూర్వకథని గమనిస్తే కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వర గర్వంతో సాధుజనులను పీడించేవాడు.తన అహంకారంతో భూదేవిని ఎత్తుకెళ్ళి పాతంళంలో దాచాడు.ఆగ్రహించిన విష్ణుమూర్తీ దశవాతారాలలోని మూడవ అవతారం అయిన వరాహస్వామి అవతారంలో వెళ్ళి పాతాళంలో హిరణ్యాక్షుడుతో యుద్ధం చేసి భూదేవిని రక్షించాడు.అప్పుడు వరాహస్వామి భూమాత మోహానికి గుర్తుగా వారికి జన్మించినవాడు నరకాసురుడు. వరాహస్వామి భూమాత నిషిద్దసమయంలో కలవడం వలన అసురసంద్యా సమయంలో జన్మించడంతో నరకాసురుడికి పుట్టుకతో రాక్షస లక్షణాలతో జన్మించాడు.ఇది తెలిసిన భూమాత అతన్ని విష్ణుమూర్తీ సంహరిస్తాడని తన బిడ్డ చావు తన చేతిలోనే ఉండాలని వరం విష్ణుమూర్తీ వద్ద వరం తీసుకుంటుంది.తర్వాత నరకాసురుడిని జనకుడు అనే రాజుకి అప్పజెప్పి విద్యాబుద్దులు నేర్పించమంటుంది భూమాత.జనకుడు నరకాసురుడికి మంచి విద్యాబుద్దులు నేర్పించి రాజును చేస్తాడు. నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము (ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం.) అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు.తన రాజ్యములోని ప్రజలందరిని ఎంతో చక్కగ పరిపాలించేవాడు.ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.తర్వాత ద్వాపరయుగములో, అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది.బాణాసురుడు స్త్రీలోలుడు.వారిపై బలాత్కారం చేసేవాడు.అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు.అతనితో నరకాసురుడు స్నేహం చేశాడు.అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు.ఇంకా అతనిలో పుట్టుకతో వచ్చిన రాక్షస లక్షణాలు బయటకి వచ్చాయి.నరకాసురుడు కామ పిశాచి అయ్యి ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు.ఆ విధముగా 16,0000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి దేవేరి-భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడే అయినా.. పుట్టిన వేళా విశేష ఫలింతంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామ రూపాధిపతిగా మారతాడు. తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోవాసులను... దేవతలనూ విడిచి పెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. .దీంతో నరకాసురుడి ఆగడాలనుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరిి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు.ఈ విధంగా నరాకాసురుడు కృతయుగం నుండి ద్వాపర యూగం వరకు అందరినీ హింసించసాగాడు.
ద్వాపర యుగంలో విష్ణుమూర్తీ శ్రీకృష్ణుడుగా భూదేవి సత్యభామగా జన్మించారు.నరకాసురుడు యొక్క దుశ్చర్యలు మితిమీరి పోవడంతో శ్రీకృష్ణుడు సత్యభామ.సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు.వారి మధ్య యుద్దం భయంకరంగా సాగింది. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధంలో సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. అప్పుడు సత్యభామకి కృతయుగంలో వరాహస్వామి తనకి జన్మించినవాడు నరకాసురుడు. అని తన బిడ్డను తానే చంపానని దుఃఖించి నా కుమారుడిని ఈ లోకం గుర్తుంచుకునేటట్లు చేయమని శ్రీకృష్ణుడిని కోరండంతో నరకాసురుడు ఆశ్వయుజ బహుళచతుర్దశి నాడు అంతమవ్వడంతో ప్రతియేడు ఆశ్వయుజమాసంలో వచ్చే చతుర్దశిని నరకచతుర్దశిగా జరుపుకుంటారని ఆయన సత్యభామకి వరమిచ్చాడు.
నాటి నుండి తమ కష్టాలు తొలిగి పోయాయని సంతోషించి ప్రజలు అమవాస్య ముందురోజు నరకచతుర్దశిగా మరునాడు అమవాస్య రోజు దీపావళిగా దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి ాదీపావళి్ణ పండుగ జరుపుకోవడం మన ఆచారమైనట్లు మన పురాణాలకథనం.ఈ విధంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారు.
పండుగ నీతి: పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి మంచి తెలపవచ్చని,అలాగే చెడ్డవారితో స్నేహం చేయరాదని,దుష్టులకు అంతం తప్పదని తెలుపుతుంది.
దీపావళి శుభాకాంక్షలతో....
(సేకరణ..)
- డి.అమీర్
తెలుగు ఉపాధ్యాయుడు
ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా ,9642480702