Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెడు పై మంచి
సాధించిన విజయానికి ప్రతీక
దీపావళి పర్వదిన వేడుక !
ఆడ ది అబల కాదు
సబల అని నిరూపించి
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి
ప్రతి పురుషుడి విజయం వెనుక
స్త్రీ పాత్ర ఉంటుందని నిరూపించిన
విజయగాధే దీపావళి !
శ్రీ కృష్టుని సాయంతో
సత్య భామ ఉగ్రమూర్తి యై
దుష్టుడైన నరకుడిని వధించి
లోకానికి శాంతిని, క్రాంతిని
ప్రసాదించిన ఓ స్త్రీ మూర్తి
విజయానికి ప్రతిరూపం
దివ్య దీపావళి పర్వదినం !
నాడు ఒక్క నరకాసుర సంహారానికి
ఒక్క సత్య భామే చెప్పింది జవాబు
మరి నేడు .....
పేటకో నరకాసురుడున్న తరుణంలో
ఇంటికో సత్యభామ తక్షణ ఆవశ్యకం !
కాకర పు వ్వొత్తు లిచ్చే చిటపటలు
కడిగేయాలి మనలోని కులాల కుళ్ళును
మతాబులిచ్చే వెలుగులు
మనలోని మతాల మూఢతను తొలిగించి
పూయించాలి మమతానురాగాల మధురిమలను
చిచ్చు బుడ్లు ఇచ్చే చెమ్కి రంగులు
నిజజీవితంలో పూయించాలి ఆనందపునవ్వులు
ఇదే నవ్య దీపావళి
మనకిచ్చే దివ్య సందేశం !
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి,7416638823