Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగింటి దీపం దీపావళి !
వెలుగింటి రూపం దీపావళి !
అమావాస్య చీకట్లు
తొలగించు అరుదైన దీపం
ఈ దీపావళి దివ్య సందేశం !
నరకాసురుడి చీకటి రాత్రి
నరులకు వెన్నెల రాత్రి
జీవితం సుఖ దుఃఖాల సంగమం
చీకటి వెలుగుల రసమయం.దీపావళి
మహిళా లోకానికి మేలుకొలుపు దీపావళి
దీపం పరమార్థం లోకానికి
అందించే అపురూప సందేశం
దివ్య దీపావళి శుభ సందేశం
మహిళా లోకానికి ఘన విజయం
మహిళా ప్రగతి కి ప్రతి రూపం
అపర సత్యభామ తొలి విజయం
కసాయి కరోనా చీకట్లు చీల్చే
వెలుగుల మహోదయం దీపావళి
అందరికీ శుభోదయం దీపావళి
వరుస ప్రమిదలు సమూహం
జగతి ఐక్యత స్వరూపం
విశ్వ శాంతి మణిదీపం
బాణాసంచా కాంతి తేజం
చిన్నారులకు సందడే సందడి
చిరు కాంతుల దీపావళి ఆదర్శం
దివ్య దీపావళి శుభ సందేశం
- లక్కరాజు ప్రఫుల్ల చంద్ర
ధర్మవరం, అనంతపురం జిల్లా
6300546700.