Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి
బ్రాంతి తొలిగి క్రాంతి ఇచ్చునాది
చేదు తో పాటు తియ్యని తీపి వంటల ఘుమ ఘుమలు
చిన్నారులు కాకర్లు చేత బట్టి రివ్వున తిప్పి
పాము గోళీలు కాల్చి పడుగలను చూచి
పిస్తులోతో పూర్ణిలు కాల్చి
మురింపంగా ముచ్చట పాడే బాలుర పండుగ
ధన లక్షిమి పూజాలు
అమ్మ వారిని ఆరాధించి
కొత్త అల్లులను ఇంటి కి
పిలిచి ఆడపిల్లల పుట్టిటోళ్లు మరవద్దు అని
చెప్పే అనురాగల లోగిళ్ళ పండుగ
రంగు రంగుల దీప ప్రమీదలు వెలిగించి
ఇంటి వాకిట ముగ్గులతో
ముర్పించి
అభ్యంగా స్నానాలు ఆచరించి ఆడపిల్లల తో
హారతి తీసుకొని కష్టాలు
అనే చీకట్లు చీల్చి
సంతోషం అనే సంకలనల
సంకల్పమే దీపావళి
సీజనల్ గా వచ్చే క్రీములు
ట పాసులతో పటాస్ అయ్యి
ఆరోగ్య కాంతిఇవ్వాలి
అక్క చెల్లెళ్ళ అనురాగ ప్రతీక బాగిని హస్త భోజనం
తో అక్క చెల్లెళ్ళ ఇంట అన్న తమ్ముళ్లకు భోజనము.. పెంచును రక్త సంబంధ విలువల్ని
దీ పావళి అంటే నరక సుధ వదా
చెడును సమాధి చేసి..మానవత్వాన్ని నాటలి
సమైక్య జీవన సౌరభాలు
చిమ్మలి
మారుతున్న పండుగను
ప్రకృతిని వికృతి చేయని
రీతిలో జరుపుదాం
పర్యావరణానికి హాని చేసే
పాటకులు వద్దు..పోషకాలు
ఇచ్చే ఆహారం పై వ్యయం
చేద్దాం.. దీపావళి ఉన్నోడి
పండుగ కాక..ఊరంతా కాంతులు నింపే పండుగ
కావాలని ఆశిద్దాం
-ఉమశేషారావు వైద్య
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ
సెల్.9440408080