Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవుల్లో ఆనందవిహారం
తేనెపట్టుకై విశ్వప్రయత్నం
పొలాలల్లో పులకింతల పయనం
మోటబావిలో స్నానం
ఏటిగట్టుపై చేపల వేట
కోనేటిలో మునకల సయ్యాట
గిల్లిగజ్జాల కాకెంగిల్ల చిరుస్నేహం
చిట్టిపొట్టి అలకల పయనం
పుస్తకాల్లో నెమలీకలు దాచిన వైనం
అగ్గిపెట్టెలో
తూనీగలను బంధించిన బాల్యం
కోతికొమ్మచ్చి ఆటల కొంటెతనం
చిట్టిపొట్టి చాడీల చిరు యవ్వారం
అరుగుపై ఆడిన వామనగుంటలు
వెన్నెల రాత్రుల్లో గోరుముద్దలు
మధుర అనుభూలతుల సమాహారం బంగరు బాల్యం
అయిత అనిత
జగిత్యాల
8985347424