Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా.
9381361384
కల్లాకపటం ఎరుగనివారు...
కలతలకర్థం తెలియనివారు...
కల్మష హృదయులసలే కారు...
కలిసికట్టుగా ఆడేవారు...!
కాసులకై వెంపర్లాడనివారు...
క్రౌర్యం,క్రోధం నేర్వనివారు...
కృతకపు నవ్వులు రువ్వని వారు...
కిరికిరిలెన్నున్నా,కినుక వహించినా...
కాలం మరచి ఆటపాటల్లో మునిగేవారు...!
కిలకిల నవ్వుల ముఖ కాంతులతో...
కూరిమితో మెలిగేవారు...
చిరు కానుకలతో మురిసేవారు...
కుళ్లు, కుతంత్రాలకు దూరం వారు...!
అమ్మానాన్న కనుపాపలు వారు...
పెద్దల కాపున పెరిగే వారు...
క్లేశాలు,కడగండ్లు,కల్లోలాలు మరచి...
కలిసిమెలిసి కాలం గడిపేవారు...!
భావి భారత పౌరులు వారు...
క్రాంతి సమాజ నిర్మాతలు వారు...!!!