Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
పసినవ్వులు పుడమిపై
విచ్చుకున్న స్వచ్ఛమైన
మల్లెల్లాంటి ముత్యాలు
వేసే ప్రతి అడుగులో
ఎన్నెన్ని కొత్త దారులో
ఆకాశమంత ఆనందం
పలికే ప్రతి పలుకుల్లో
ఎంతటి తియ్యదనమో
అంతులేని ఆశ్చర్యం
చేసే ఆ చిన్ని పనులు
అలవికాని అనురాగాలు
అమ్మ ఎదలో శాశ్వతాలు
చిన్నారుల చూపుల్లో చిక్కిన
ప్రతిదీ ఓ ఆశ్చర్యమై
చిన్నిమనసులో మెదిలే ఆలోచనలు సరికొత్త సృజన
వారి ప్రపంచంలో వారే రాజు
మనమంతా బానిసలమే
వారి సేవకులమే
బాల్యం బంగారు లోకం