Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రవీందర్ కొండ
హైదరాబాద్, 9848408612
నవ్వుల చిరుప్రాయం..
చిందించే ధరహాసం.
మూగవోయిన పిల్లనగ్రోవిలా
ఆకుచాటు పిందెలై..
ఎడారిలో చందమామతో
కబుర్లు చెపుతుంటే .
బడి గది బోరుమంటుందీ
గంట మ్రోగించలేక
కాలం..
కన్నీళ్లతో వేదన ఓలకపొస్తుంది
పిల్లల అల్లరిలేక . చెట్టుమీది
పక్షులు ఎపుడెప్పుడు వస్తారని
ఆకాశంకేసి ఎదిరిచూస్తున్నవి..
తరగతి గదిలోని నలుపుతనం
పూసుకున్న గోడ..
సుద్దముక్క తెల్లటి అక్షరాల
సందడిలేక బోసిపోయింది..
బోసినవ్వులు -వెన్నెల మబ్బులు
మురిసిన వసంతం -ఆట ప్రాంగణం
కలబోసుకొని ఆడుకున్న స్నేహం
చిగురు పూయక.. బాల్యం
గత జ్ఞాపకాలను..
నెమరువెసుకుంటూ..
బాలల పండుగ కు..
పరిమళలు అద్దాలని..
చాచా నెహ్రూ...గులాబీలతో
ముచ్చటిస్తూ..
తిరిగి బడి తలుపులు
తెరవాలని ఆశ పడుతోంది!