Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి భాగ్యలక్ష్మి,
బ్రాడీపేట, గుంటూరు. 9704725609
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు
కానీ వీరిలో ఎంతమంది రేపటి పౌరులుగా ఎదుగుతున్నారు
ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, పోషణ లేక
వీధి బాలలుగా అనాధలుగా తిరుగుతుంటారు.
కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న
చిత్తు కాగితాలు ఏరుకుంటూ
తమని తాము పోషించుకుంటుoటారు.
అంధకార బంధురమైన వీరి జీవితం
ఎటు పయనిస్తుందో తెలియక
వెర్రి చూపులు చూస్తుంటారు
ఎన్ని ప్రభుత్వాలు మారినా
ఈ అనాధ చిన్నారుల్ని పట్టించుకునే నాధుడే లేడు.
ప్రభుత్వం కూడా "గరీబీ హటావో" అంటూ
నినాదాలు చేస్తుoదే తప్ప
వాటిని ఏ ప్రభుత్వం కూడా
ఆచరణలో పెట్టిoదా? అంటే లేదు
ఎలక్షన్స్ వస్తే ఈ నాయకులు గాని నాయకులు
పేదల ఇళ్లకు వెళ్లి చేతులెత్తి మ్రొక్కుతు
డ్వాక్రా మహిళలకి రుణ సౌకర్యాలు
రైతులకు రుణ సౌకర్యాలు
రైతులకి లక్షల్లో రుణమాఫీలు,ఇంటింటికి ఉద్యోగాలు
ఆడపిల్ల పుడితే 5000 బ్యాంకు డిపాజిట్
అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
అంటూ నినాదాలు చేసి ఓట్లు దండుకుoటారే కాని
ఆ తర్వాత ఐదు సంవత్సరముల వరకు కనపడరు
పాపం ఈ అనాధ చిన్నారులు మాత్రం
అన్నమో రామచంద్రా! అంటూ అలమటిoచాల్సిందేనా?
పేదల ఓట్లతో పట్టం కట్టించుకున్న ఓ మంత్రివర్యులు, పెద్దలు
ఈ అనాధ బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి
వారి ఆకలి దప్పికలు తీర్చoడి విద్యా దానం చేస్తూ
అమ్మానాన్నల ప్రేమని పంచుతుంటే
అప్పుడు ఆ చిన్నారుల కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలి
ఆనందంతో కేరింతలు కొడుతూ
భావితరానికి ప్రతినిధులo మేమే అంటూ
ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి
మార్గం సుగమం చేసుకుంటుంటే
మనమంతా కూడా ఈ చిన్నారి బాలలతో
చేయిచేయి కలుపుదాం వారి కలల్ని నెరవేరుద్దాం.