Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జామి సత్యనారాయణ
కవి,రచయిత,నటుడు,ఉపాధ్యాయుడు
రాజమహేంద్రవరం
పల్లవి: నేటి బాలలు మీ పుట్టినరోజు
రేపటి పౌరులు మీ పండగ రోజు
నెహ్రూ కథనే వినరా నిజ మార్గం నువ్వు కనరా //నేటి బాలలు//
చరణం: చాచా అంటే నెహ్రూజీ చాలా ఇష్టం గురూజీ
నెహ్రూ మనకు ఆదర్శం నేతలతో అనుబంధం
భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తాతే కదరా
ప్రపంచమంతా మెచ్చుకునే శాంతిదూత కదరా
భారతదేశం శాంతి మయం నెహ్రూ తోనే సాధ్యమయం //నేటి బాలలు//
చరణం: పిల్లలు అంటే పిడుగులురా చదువుల తల్లి బిడ్డలరా
బడిలో చదువు భాగ్యమురా బంగారు బాట వేయునురా
భారతదేశం గర్వించే ముద్దుబిడ్డలు కావాలి
భారతమాత ఉప్పొంగే ఉత్తమ పౌరులు కావాలి
నెహ్రూ తాత ఆశయం ఇదే నెరవేర్చుటకు కృషి చేద్దాం //నేటి బాలలు//