Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరి ప్రసాద్ చెలమల్లు,
హైదరాబాద్, 9593388201
పిల్లలూ
అదిగో
ఇంకా దుమ్ము తో సావాసం చేస్తున్న పాదాల పిల్లలు
ఇటుక బట్టీల్లో
భవన నిర్మాణాల్లో
చేతులు కాయలు కాసేలా
శ్రమించే పిల్లలు యాడ చూసినా
అక్షరం అందక
అందినా అందక దోబూచులాడుతుంటే
పిల్లల దినోత్సవ వేడుకలు ఏల
పశుల గాచే పిల్లలు
పాడే గీతాలు
గాయాల పునాదులోంచి పుడుతుంటే
గణతంత్రం పుస్తకాల పుటల్లోనే
భుజాని కో సంచి
పుస్తకాలు కాదు సుమీ
చేతిలో కర్ర
సూరీడు రాకముందే వీధుల్లో
చెత్త ఏరేందుకు ఎగురుతూ పిల్లలు
నాలుగు రోడ్ల కూడల్లో
బతుకు బతుకుట కై యాచన
ఎవరు కన్న పిల్లలో
క్షణికావేశంలో బైట పడ్డా రూ
పిల్లలకీ
ఎర్ర గులాబీ ధారుడికి లంకెరుగక
లబోదిబో మంటున్న పిల్లలూ
పిడికిళ్ళు బిగించరూ...