Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బూర దేవానందం
తెలంగాణా శిరస్సుపై కీర్తికిరీటం కాళోజీ
తెలంగాణా జనుల ఆత్మగౌరవం కాళోజీ
తెలంగాణా మాటకు ప్రతిరూపం కాళోజీ
తెలంగాణా జాతికి ఆరాధ్యుడు కాళోజీ
కలంను బంధూకు జేసిండు
కవితల తూటాలు పేల్చిండు
భయమన్నదే ఎరుగనోడు
నైజాం సర్కార్ను ఎదిరించిండు
అన్యాయం జరిగినకాడ
అగ్గపిడుగు అయ్యిండు
బక్క పలచగనే ఉన్న
గుండె బలం జూపిండు
జడుపన్నదే ఎరుగనోడు
ఎంతటోడినైనా ఎదిరించిండు
అన్యాయాన్ని ఎదిరించెటోడు
నాకు ఆరాధ్యుడు అన్నడు
కాళోజీ కవితల్లో ఉంది
తెలంగాణా జీవభాష
కాళోజి మాటల్లో ఉంది
తెలంగాణా కమ్మని యాస
బడిపలుకుల భాషకన్నా
పలుకుబడుల భాషమిన్న
అన్నడు ప్రజాకవి కాళోజీ
గాదారినే నడిసిండు...
తెలంగాణ భాషకు పేరుదెచ్చిండు