Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబ జనోద్దారకమా..
మోతీలాల్,స్వరూపమ్మల మురిపపు తనయమా..
ఇందిరమ్మకు ఆదర్శ గురు పితృవాత్సల్యకమా..
గాంధీజీ మార్గ రైతు బాంధవ ఘనకీర్తి ప్రదాతమా..
సహాయ నిరాకరణోద్యమ పిపాసిక చైతన్యమా..
సంపూర్ణ స్వరాజ్య ఉద్యమ సమరయోధమా..
స్వతంత్ర భారత తొలి ప్రధాని అధీనేతృత్వమా..
పంచవర్ష ప్రణాళికా రూపశిల్పమా,పంచశీల మనస్కమా
ఆనకట్టలే ఆధునిక దేవాలయాలన్న వైఙ్ఞానిక ధిగ్గజమా..
జలసిరి సాగర్ ప్రాజెక్టు పురుడుకు అంకురార్పకమా..
సాంకేతికత,ఉన్నతవిద్యాసంస్థల సంకల్పకమా..
అలీన ఉద్యమ తేజమా,దేశ సంస్కృతీ ప్రీతిపాత్రమా..
న్యాయవాద కోవిద,అద్భుత గ్రంధకాల మేధోమధనమా
చిట్టి మినుగురు పసి మొగ్గల చాచా హృదయమా..
చిన్నారుల హృది గెల్చిన బాలల ప్రేమిక సహృదయమా..
జగతి సిగలో విరిసిన దిగ్విజయ శాంతికపోతకమా...
తల్లిపాల స్వచ్చ ఎర్ర గులాబీ పరిమళ మనస్కమా..
ఆయనే మన బాలల గుండెసవ్వడి పండిట్ నెహ్రుజీ..
శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
ప్రధానోపాధ్యాయని
నరసరావుపేట
8500988499
మెయిల్: rajyalakshmiramesh@gmail.com