Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనలా తన కొడుకు
ఆర్ధిక ఇబ్బందులు పడరాదని
అడిగినంత ధనాన్ని ఇస్తూ....
ఒక్కగా నొక్క కొడుకని
అ తిగారాబం చేస్తూ...
కొండమీది కోతినైనా కొనిస్తూ..
పెంచిన పెంపకం
అతడ్ని వ్యసనపరుడ్ని చేసి
జీవితాన్ని అస్తవ్యస్తం చేసి
కన్న వారికీ గుండె కోత ను మిగిల్చింది!
తనలా తన కొడుకు
విలాసాలకు బానిసై
వ్యసనపరుడు కా కూడదని
అతిగారాబం అనర్ధాలకు హేతువుగా భావించి
బావిలో కప్పలా
పంజరంలో చిలకలా
అదుపు ఆజ్ఞల్లో ఉంచి
పెంచిన ఫలితం......
అతడ్ని చేసింది నిష్ప్రయోజకుడ్ని!
విషయ పరిజ్ఞానం లేక
చిరుద్యోగమైనా సాధించలేక
నిరుద్యోగిగా మిగిలాడు
కన్న వారికీ గుదిబండగా మారాడు
జీవితంలో నిస్సహాయుడై మిగిలాడు!
స్వేచ్ఛ మీరి ఒకరు
స్వేచ్ఛ లేక మరొకరు
కన్న వారికీ భారమై
సభ్య సమాజానికి దూరమై
బతుకు బండిని భారంగా లాగుతున్నారు!
అవసరం మేర స్వేచ్ఛను అనుభవిస్తూ
అవసరమైన బాధ్యతలను స్వీకరిస్తూ
నడవాలి యువతరం విజయపధం వైపు!
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు
7416638823