Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వ్యవస్థకు
నాలుగు దిక్కులు
నాలుగు కళ్ళు!!...
నాలుగుమూలలూ
నాలుగు పాదాలు!!...
నాలుగు ద్వారాలు!!...
కాలాన్ని బంధించి
కడుపులో దాచుకుంటాయి!!... అస్థిత్వాన్ని నిలబెట్టి
కొత్త కాంతితో వెలుగుతూ...
ప్రతిక్షణం చూపులతో కట్టేస్తాయి!!...
ప్రకృతి ధర్మాన్ని నిలబెట్టి
వాస్తవ రూపాన్ని చూపిస్తాయి!!...
జగతి గతికి...
నాలుగుస్తంభాలై
నిలిచాయి!!...
దిశానిర్దేశం చేస్తాయి!!..
ప్రయాణమార్గాలుగా
నిలుస్తాయి!!..
నడకకు గమ్యం...
ఈ దిక్కులే!!...
అందరిని అదుపులో
ఉంచేస్తాయి!!...
అప్పుడప్పుడు కాలం
దిక్కుల డొక్కలను
పొడుచుకుని
పరుగెడుతుంటాయి!!...
వీచే గాలులను బట్టి...
పొడిచే పొద్దును బట్టి...
నడిచే నడకలను బట్టి...
విలువలను తెలుసుకోవచ్చు!!...
వాస్తువును నిలుపుకోవచ్చు!!...
ఈ దార్లన్నీ రాచవీధులు!!...
మనుషుల నడవడికకు
ముడి పడినవి!!...
ఏ మనిషీ ఒంటరి కాదు!!...
దిక్కులన్నీ తోడై నిలబడ్డాయి!!...
తనచూపులతో మోస్తూ
వ్యవస్థను సురక్షితంగా చూసుకొంటాయి!!...
ఎవరు గాయపర్చారో కానీ...
తూర్పు కళ్లెర్ర జేస్తోంది!!...
పడమర కత్తులు దూస్తోంది!!...
ఉత్తరం ఉరిమి చూస్తోంది!!...
దక్షణ తరూముతోంది!!...
దిక్కులన్నీ ఒక్కటై...
ధిక్కారం చేస్తున్నాయి!!...
సమాజం డొక్కలో
పొడుస్తున్నాయి!!..
ఈ దిక్కులను
ఎవరూ కూల్చలేరు!!...
ఎవరూ పేల్చలేరు!!...
ఎవరూ కాల్చలేరు!!...
ఎవరూ పడగొట్టలేరు!!...
ఇవి ఎవరూ పెట్టని గోడలు!!...
ఇవి ఎవరూ పాతని స్తంభాలు!!...
అందరికీ భద్రత కల్పిస్తాయి...
సమస్తాన్ని భుజాలకెత్తుకొని
మోస్తుంటే..చుట్టూరా
కంచై నిలబడుతాయి!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801