Authorization
Sat April 05, 2025 11:33:44 pm
రవి అస్తమించని
ఆంగ్లేయుల నిరంకుశ పాలనను నిరసిస్తూ..
కత్తి దువ్విన సమరాంగణి..
దమనకాండకు వ్యతిరేకంగా
పోరాటం సలిపిన వీరంగణి..
వీపున బిడ్డను కట్టుకొని,
చేతిన ఖడ్గము పట్టుకొని
అశ్వారోహణ చేస్తూ..
తెల్ల దొరలను దునుమాడిన..
ఆడ సింహణి..
కదనరంగంలో వైరి శిరస్సులను తెగ నరికిన..
అపర కాళిక..ఝాన్సీరాణి..
మహిళా ప్రపంచానికే వన్నె తెచ్చిన ధీర శిరోమణి..
నేటి సమాజంలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కామాంధులను సంహరించేందుకు
ప్రతి తరుణికి
ఆదర్శంగా నిలిచిన..మణికర్ణిక వీరనారీ'మణి'..!
--సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్