Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భరతమాత శౌర్యం
ఆమే ధీరత్వం
దేశభక్తి నిండుగా
నడిపించిన నాయకత్వం
బానిసతనాన్ని
భరించలేనితనం
ఎదిరించడమే ఆమె నైజం
గుండెధైర్యం తెగువ
ఆమె అణువణువునా
పరాక్రమం
యుద్ధ పటిమతో
తెల్లోడినెదిరించడంలో
చూపించెను పౌరుషాగ్ని
భారతీయులను ఐక్యపరచి
తిరుగులేని పోరాటమై నడిపించింది
తన ప్రాణాలను దేశంకోసం
అర్పించిన అమరురాలు
నేటి స్త్రీమూర్తులందరికి ఆదర్శం
ధైర్య లక్ష్మీ జీవితం
దారేదైనా నిబ్బరంగా ఎదురెల్లి ఎదుర్కొనే నేర్పును నేర్చుకుంటూ
ఝాన్సీ లక్ష్మీ లా సాగాలి
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.