Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదాములో నడిచి నడిచి నాకాళ్ళు మోకాళ్ళచిప్పలు అరిగిపోయినై
వంగిలేచి నడుములు రోజుదినదినం సత్తువలేకుండయినై
భుజాలు అరిగినీళ్ల చెంబు కూడా
లెవకుండయ్యింది
దగ్గి దగ్గిఎదలుఎండుకపోతున్నాయ్
రోడ్డుమీద పది రూపాయల డాక్టరే
మాకు ఆపుటకు నొప్పులు తక్కువ
చేసే దేవుడు
అగొ గామిల్ట్రీల పోయినోళ్ళకు
16ఏండ్లకే ఇంటికి పంపిచ్చి మల్ల
ఎదన్నకొలువు ఈస్తరంట
అన్ని గవురుమేంటోళ్లే సుసుకుంటారంట
గాళ్ల లాకా మాకు గయన్ని ఏమొద్దు
వాళ్ళు దేశం కోసం ప్రాణమిచ్చే దేవుళ్ళు
మాకు తాతలు సంపాయిచ్చినఆస్తిలేదు
మాపిల్లలలకు ఇంత సదువు
సొస్తయితే గింత వైద్యం
సదిపిచ్చి సుపిచ్చుకునే థాకత్
లేదు కనీసం
ఇంత గొడ్డు కష్టం చేస్తే చేసి చేసి
అలిసిపోయిన మాకు
రిటైర్మెంట్ లేదాఏడిస్తే కన్నీళ్ళు
వస్తలేవు రక్తం వస్తుంది
ప్రతోడు సంచేమ పతకాలంటడు
కార్మికులు రైతులు మీరే దేవుళ్లంటడు
ఈ ...........మంత్రులు మ్యాదావులు
ఏంచేస్తున్నారు
గా పక్కదేశంలా గిపక్కదేశంలా
చూసన్న సిగ్గోస్తలేదు
వాళ్ళు వాళ్ళ రైతుల్ని కార్మికుల్ని
సొంతాబిడ్డలోలే సుసుకుంటారంట
గిళ్లకు ఈళ్ల కొడుకులు బిడ్డలు
సూట్టలే ముఖ్యమాయే
మనబతుకులు సుత్తారు ......
చ్ఛి .......?
అందుకే ఏగోదాంల ఎవ్వరికేమైన
ఒక్క కూతతోటి మొత్తం లేసి కూసోవాలే
మనకోసం ఎవడన్న ముందుకొస్తే
అగ్గో గాళ్లను కడుపుల వెట్టి
సూసుకోవాలే
రాండ్రన్న సమ్మెకు ఒదం అక్క రాండ్రక్క రాచేల్లే రాతమ్మి
బాలన్న ఈడువొద్దు జెండా సుడు
దేశం మొత్తం సమ్మె
మనోళ్లే రోడ్లనిండా వర్ధిల్లాలి
కార్మికుల ఐక్యత
కాశీదాస్