Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీతాల పెంపుదల కు కాదు
అనగారిన జీవితాలపై ప్రైవేటీకరణ
ఉక్కుపాదం మోపుతున్నందుకు
" సార్వత్రిక సమ్మె!
బ్రిటిష్ నల్ల చట్టాలను తిరగ దోడి
కార్మిక హక్కుల హననానికి
కొత్త చట్టాలు చేస్తున్నందుకు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసి
ఉద్యోగ కార్మికుల హక్కులను కాలరాస్తూ,
రైతుల హక్కుల పై రెక్కల పై
నయా చట్టాలు మోపుతున్న అందుకు
" సార్వత్రిక సమ్మె"
భద్రత లేని ప్రజలు స్త్రీలుఆదివాసీల రక్షణకై
పూనుకొమ్మని హెచ్చరించడం కోసం....
వలస కూలీల నువ్ అంచులను చేసి,
కార్పోరేటర్ జేబులు నింపే
అనాలోచిత చర్యలు అడ్డుకోవడానికి...
" సార్వత్రిక సమ్మె"
దిగజారుతున్న శాంతి భద్రతలు,
పెరుగు మూక హత్యలు, అఘాయిత్యాలు,
మేధావుల పైనిర్ బంధాలనుండి
ప్రభుత్వాలను మేల్కొలపడానికి....
మత ఘర్షణ ముసుగులో మానవత్వాన్ని,
ఆత్మ నిర్భరత పేరుతో అమ్ముతున్న ప్రభుత్వ ఆస్తులు,
ప్రజలకే దక్కాలని ప్రతిఘటించడానికి...
" సార్వత్రిక సమ్మె"
ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ,
పేదరిక నిర్మూలన ,ఉపాధి కల్పనలు లేని,
కార్మికుల కొనుగోలు శక్తిని దెబ్బ కొట్టే,
ప్రజా వ్యతిరేక విధానాలను,
ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్డుకోవడానికి....
" సార్వత్రిక సమ్మె"
వడ్డేపల్లి మల్లేశము,9010207412
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)