Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ నయవంచక పాలకుల
కార్పొరేట్ డేగల విషకౌగిలిలో..
మానవత్వమెరగనిముష్కరులతో..
నలుగుతుంది భారతం.. రగులుతుంది కార్మికలోకం..! కార్మికుల చెమటచుక్కల్ని కొల్లగొడుతున్న కబోదులు.. శ్రమజీవుల రక్తాన్నితాగే అభినవ తోడేళ్ళు..!!
శ్రామికపరిమళాలు వెదజల్లుతూ,
వీచేవడగాల్పుల్లో
కండలు కరిగించి..
స్వేద బిందువులు చిందించి, బండల్ని పిండిజేసి,
కార్ఖానాల్లో కాలుతూ..
మండుటెండలో ఎండుతూ.. తూర్పు కొండకు తిలకం దిద్దిన కార్మిక వీరులం..
కణకణమండే కర్షకులం..!!!
చట్టం పాలకుల చుట్టమై,
లేబర్ కోడులకొరడాఝలిపిస్తు
కార్మిక హక్కులకు ఉరితాళ్లవ్వగా..
చెమటచుక్కల కంటకన్నీళ్ళే.. పనిగంటల తగ్గింపుకై,
వేతనాల పెంపుకై,
చికాగోలో చిందిన రక్తంలో.. ఒరిగిన ధ్రువతారల స్వప్నకై ఎగిసిపడుతున్నపోరు కెరటాలై..
పదండి ముందుకు పైపైకి..!!!! పనిలోగనిలోకార్కనాలో..
విరామమెరుగక పరిశ్రమించే కార్మికులారా..
ఆరు గాలాలు మాగాణాల్లో హలాలు దున్నే శ్రామికులారా..
సమ్మె సైరన్ మోగింది, పోరాటాలే శ్వాసగా..
నెత్తుటి ధారలేతోవగా..
నరాలే స్వరాలై,
వేనవేలగొంతుకలెత్తి
హక్కులకై కలబడుదాం.. ఐక్యంగా నిలబడదాం.. సమరశంఖం పూరిధ్ధాం..!!!!!
డి. కృష్ణయ్య( హిమబిందు) వీపనగండ్ల