Authorization
Sun April 06, 2025 01:18:16 am
గడియారం తిరగబడింది
అపసవ్యంగచూపుతుంది కాలాన్ని
కాని కాలం ఆగదు.
ఖార్ఖానాలు పనిముట్లు
సంపద సౌఖ్యాలు
శ్రమజీవుల నరాలు రక్తమాంసాలు
కార్పరేటు పరాన్నభుక్కులవశమాయే
పడేసిన భిక్షను వరంగా పొంది
రాక్షసులు సంపదను శాసిస్తున్నారు
సృష్టికర్తలను పీడిస్తున్నారు
తరతరాల పోరాటల దరిమిల
సమకూర్చుకున్న అరకొర హక్కులు
క్రోడికరణ పేరిట ఖతంచేస్తున్నారు
సంపద ట్రస్టీలు భక్షకులకు రక్షకులై
కాలనాగుల్లా కాటేస్తున్నారు
కార్మికచట్టాలను తిరుగరాస్తున్నారు
కాలంతిరగబడేలా!
సూర్యున్నాపలని భూమిని స్తంభించాలని
తెగ ఆరాటపడుతున్నారు పాసిస్టు పాలకులు
మేఘాలమబ్బుల మాటున
కార్మికులు కళ్లు తెరిచారు
సమరశంఖం పూరించారు
కలిసిరండి కదిలిరారండి
సమ్మెను జయప్రదం చేయరారండి
శ్రీమంతుల భాస్కర్ రెడ్డి
9491485850