Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రమ లోనే ఆనందం
శ్రమ తోటే సాంగత్యం
ఆకలి పిండేస్తున్నా
ఇడుములు కమ్మేస్తున్నా
నడుము కట్టుకు పని చేయడమే !
కండలు కరిగించి కాసులు కురిపించడమే !!
వారు శ్రామికులు ...అసలైన సంపద సృష్టికర్తలు !
అవును వారే ...సిసలైన అభివృద్ది కారకులు !!
సాధించి తెచ్చుకున్న కార్మిక చట్టాలకు
తూట్లు పొడుస్తూ నూతన చట్టాలు ....
లోపభూయిష్ట విధానాలు ....
కార్పొరేట్ల కుహానా వాదాలు ...
గతి తప్పిన రాజకీయ నిర్ణయాలు ....వెరసి
కార్మికుల, కర్షకుల,శ్రామికుల స్వేచ్ఛ
స్వాలంబనలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి .....
నవ్య జగత్తు నిర్మాతల భవిష్యత్‌ను
అగమ్య గోచరం చేస్తున్నాయి ....
కొత్త బానిస విధానాలను నిర్దేశిస్తున్నాయి ....
ఎత్తిన పిడికిళ్లు ఏకమై ఎగసి పడుతున్నాయ్ ...
నిప్పురవ్వలు కెరటాలై తుళ్లిపడుతున్నాయ్ ...
విశ్రమించని యంత్రాల శబ్దాలు హోరెత్తుతున్నాయి ......
ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కదులుతున్న
వారికీ కలాలుగా...గళాలుగా మద్దతు నిద్దాం !
తమ నిర్ణయాలను వెనక్కి తీసుకునేదాకా
విరామ మెరుగని కంచు నగారాల మౌదాం !!
బి.రాణి లీలావతి
జోగులాంబ గద్వాల.
cell no: 8500100829