Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తూ
పారిశ్రామిక వేత్తలకు అడగకుండానే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ
వారికీ చౌకగా భూములను దారాదత్తం చేస్తూ
త్వర త్వరగా ముందడుగులు వేస్తున్న ప్రభుత్వాలు.....
స్వేదాన్ని రక్తంగా మార్చి
కండరాలను కరిగించి
ఉత్పత్తులను ఉత్పత్తి చేసే
కార్మిక. కర్షక జీవులకు
కనీస అవసరాల కల్పనలో ఎందుకు చూపవు?!
ఉద్యమించి సాధించుకున్న
ఎనిమిది గంటల పనిదినాన్ని
పన్నెండు గంటలకు పొడిగిస్తూ
సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లనే చట్టాలను
చుట్టలుగా మార్చుకుని
విభజించి పాలిస్తూ
లింగ వివక్షను పాటిస్తూ
ఇచ్చే వేతనాల తగ్గింపును అమలు చేస్తున్న తీరు
ఆచరణీయం కాదు.... ఆమోదయోగ్యం కాదు!
ఉన్న పెన్షన్ విధానాన్ని తొలగిస్తూ
వైద్య సౌకర్యాలన్నీ నిలిపి వేస్తూ
ప్రయివేటీ కరణకు మొగ్గు చూపుతున్న తీరును ఎండగడదాం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిరసిద్దాం
చేయి చేయి కలిపి కార్మిక ఐక్యతను చాటుదాం
పోరాడితే పోయేది బానిస సంకెళ్లేనని గుర్తెరిగి ప్రవర్తిద్దాం
ఐక్యపోరాటాలు కొనసాగించి
అధికార ప్రభుత్వాల మెడలు వంచి
అపూర్వ విజయం సాధిద్దాం!
ఆళ్ల.నాగేశ్వరరావు
తెనాలి....522201
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
సెల్ నెంబర్.7416638823
Email : allanageswararao1965@gmail.com