Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ చేతులు దేశసంపదను సృష్టిస్తున్నాయి.
అభివృద్ధికి,గుర్తింపుకు
వారి శ్రమను ధారపోస్తున్నారు.
కనీసవేతనాలు,సౌకర్యాల కోసం కదంతొక్కుతున్నారు.
బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే హక్కులను అడుగుతున్నారు.
స్వేదం చిందించి,రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమిస్తున్నారు.
పలుగూ,పార,సుత్తి,కొడవలి
సాధనాలుగా పనిచేస్తూ,
హక్కు,సాధన,నినాదం,
ఉద్యమాలతో చైతన్యమవుతున్నారు.
జాతినిర్మాతలకు జీవించే హక్కు కావాలి.
స్వేచ్ఛ,స్వాతంత్ర్యం,
ప్రజాస్వామ్యం త్రిసూత్రాలుగా
రక్షణ కావాలి.
జీవనప్రమాణాలు మెరుగుపడి
గౌరవమైన జీవనం పొందాలి.
కార్మికులు,కర్షకులు,శ్రామికులు,
హాలికులందరూ క్షేమమై
దేశం సుభిక్షం కావాలి.
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.
9948285353.