Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరటక దమనక చాణక్యంలో ప్రజాస్వామ్యం
ప్రాణ నాడులను పోగొట్టుకుంటున్నది
పుష్యమిత్ర శాసనాలకు తలుపులు బార్లా తెరుచుకుంటున్నవి
పనిగంటల పెంపుతో కార్మికులు
సంక్షేమం గిట్టుబాటు ధరలులేక అన్నదాతలు
ఫిక్స్డ్ ఎంప్లాయీ ప్రొవిజన్ తో కార్మికులు
నిరుద్యోగులు కొత్తతరం బానిసలు
చెమటోడ్చిన ప్రజల ఆస్తులు
పపుబెల్లాలకు అస్మదీయ కార్పొరేట్లకు అప్పగింతలు కొత్తపెళ్ళికొడుకు కానుకలుగా
రైతు ఇప్పుడు వెన్నెముకతోబాటు
పక్కటెముకలు పటపటవిరిగిన వికలాంగుడు
నూతన వ్యవసాయ కార్మికచట్టాల క్రోడీకరణ పాలన నజరానా
నోళ్లు కుట్టేస్తున్నా
చేతులు కట్టేస్తున్నా
కాళ్ళు కదలకుండా చేస్తున్నా
రైతు-కార్మిక- నిరుద్యోగ యువజనగళాలు
కరాలు-"కలాలు ఏకమై పలుకుతున్నయి
రాస్తున్నయి
పీడిత తాడిత జనంకోసం సమ్మె శంఖం ఊదుతున్నయి
మనం గొంతు కలుపుదాం
నగరాలు పల్లెలు ప్రతిధ్వనించేలా
సమ్మెకు మద్దతు ప్రకటిద్దాం
ప్రజా గళం వినిపిద్దాం
పంథా మార్చుకొమ్మని నినదిద్దాం
వల్లభాపురం జనార్దన
9440163687