Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టపడిన పనికి వెలకట్టి నీ జీతం ఇంతే అని నిర్ణయించే యజమాని..
తను కష్టపడుతూ కార్చే చెమట చుక్కతో యజమానులు అభివృద్ధి చెందితే..
ఆ అభివృద్ధి అంత తన తేలివితో సంపాదించిన సంపాదన అని విర్రవీగే యాజమాన్యం..
ఈ అభివృద్ధికి కార్మికుల శక్తి కారణం అని తెలిసి వారిని పట్టించుకొని తల పొగరు యాజమాన్యం..
ఎండ-వాన అనే తేడా లేకుండా పనిచేసి తన చెమట వాసనే తన ఆస్తిగా ఆనందించే కార్మికుడు ..
సమయపాలన లేకుండా తిండితిప్పలు లేకుండా..
పని చేసే కార్మికుల జీవితాలను పట్టించుకొనే నాదు డులేడు ఈ రోజుల్లో..
ఒకవేళ కార్మిక చట్టాలు ఉన్నా అవి బడా కంపెనీల సొమ్ముతో సొమ్మసిల్లి పట్టించుకోని ప్రభుత్వాలు..
నేడు కంపనిలో పనిచేసే ఉద్యోగి..
తనకు ఇచ్చిన పరిధిలో ఎంతో కష్టపడి అమ్మకాలు పెంచితే..
కంపెనీలు ఆన్లైన్లో వ్యాపారం చేస్తూ..
పని చేసే ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని కల్పిస్తూ వారికి అన్యాయం చేసే దగాకోరు కంపెనీలు..
కార్మికుల చమట చుక్కలతో పైకి వచ్చి వారికి కన్నీరు
చుక్కలను విషాద ఘడియలను నేడు మిగిలించినాయి..
అయినా మా పోరాటంను ఆపకుండా..
మా మూకుమ్మడి సమ్మెతో మీకు ఊపిరి ఆడకుండా..
మిమ్ములను కట్టడి చేసి మా హక్కులను కాపాడుకుంటాం..
రక్తవర్ణ తిలకాల-జెండాలతో
మా కార్మికుల శక్తితో ఐక్యమత్యముతో మీ మెడలను వంచుతాము..
మిమ్ములను మీఅహంకారాన్ని నేలకు దించి విజయబహుటా ఎగురవేస్తాము.
కటకం.రాజేష్-నిజామాబాద్.