Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రని ఎండల్లో సహితం రెక్కలు ముక్కలు జేసుకొని శ్రమిస్తున్నావు కార్మిక అన్న నీకు సలాం.
ఎండనక వాననక చలనక త్యాగమేజేస్తున్నావు చరిత్ర కలిగిన జీవితమే నీది కార్మిక అన్న నీకు సలాం.
నిత్యం చెమట చిందించేటి శ్రామికుడవు నీవే దేశ భవిష్యత్తు నిచేతిలోనే మారే కార్మిక అన్న నీకు సలాం.
కన్నీళ్లు కూడ మధిలోనే దాచుకొని అష్టకష్టాలు పడుతున్నావు భూతల్లి ముద్దాడుతూ సంబురపడుతున్నావు కార్మిక అన్న నీకు సలాం.
(ఎర్రని)
శ్రమైక జీవనంలోన కార్మికన్న ప్రతి పనిలోన నువ్వే నువ్వు లేనిది ఎపని కూడ సాగదు నేడు నీకు సలామే మాయన్న.
అడ్డకాడ నువ్వే బట్టి కాడ నువ్వే బస్తీలో బస్తాలు మోసెటి కాడ ఎక్కడ చూసిన నువ్వే మాయన్న నీకు సలామే ఓయన్న.
బస్సు స్టేషన్లు రైల్వేస్టేషన్లు సంతలో సరుకులు మోసి ఎక్కించేది దించేది నువ్వే ఎన్ని కష్టాలే నీకే మాయన్న నీకు సలామే ఓయన్న.
పంటపొలాలు భవన నిర్మాణాలు గిడ్డంగుల కాడ నువ్వే ఇటుక తయారీలో రోడ్డు నిర్మాణంలోన నువ్వే ఎన్ని తిప్పలు నీకు మాయన్న నీకు సలామే ఓయన్న.
(ఎర్రని)
హక్కుల కోసం పోరాటం చేసినావు శ్రమజీవిగాను రక్తం చిందించి హక్కులు సాధించుకున్నావు మాయన్న నీకు సలామే ఓయన్న.
తల్లి గర్భం నుండి పుట్టి భూతల్లి గర్భలోకి వెళ్లి ప్రాణాలు సహితం లెక్కజేయకుండానే నల్లబంగారం సిరులు తెచ్చినావే మాయన్న నీకు సలామే ఓయన్న.
బ్రతుకు దేరువుకై పోరాటాలెన్నో జేసి ఆకలితో ఆల్మటించి పోయినావు చెమటను చింది పీడిత దోపిడి సమాజానికి తిరుగుబాటు జెండాను ఎగిరేసినావు మాయన్న నీకు సలామే ఓయన్న.
శ్రమే నీ ఆయుధం రెక్కల కష్టం జేసి సమాజానికి నీవు ఆదర్శమైనావు నీ అవసరం లేని సమాజం లేనే లేదు మాయన్న నీకు సలామే ఓయన్న.
(ఎర్రని)
సత్యనారాయణ ఉప్పరి.
విశిష్ట కవి రత్న.
తెలుగు ఉపన్యాసాకుడు.
రేచిని తాండూరు, మంచిర్యాల.
9949709208.
upparisatyanarayans7@gmail.com