Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సృష్టికి అందం
శ్రమైక జీవన సౌందర్యం
విశ్వ సంపదకు మూలం శ్రామిక వర్గం
వీరి చెమట చిందనిదే
సమాజ ముందడుగు అసాధ్యం
ప్రపంచ కార్మికులారా ఏకం కండీ
అంటూ నినదించి సాధించెను
ఎనిమిది గంటల పని దినం
రష్యా చైనా లాంటి దేశాల్లో
వెలుగు నింపిన సోషలిజం
పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టాలు
అయినా శ్రమకు తగ్గ పలితం అందక
డొక్కలెండుతున్న బడుగు వర్గం
అలుపెరగక పోరు నడుపుతున్న
మీ ఐక్యతకు మా సలాం
కష్ట జీవుల సమస్యలు పట్టని
మన పాలక వర్గం
కార్పోరేట్లకే వారు దాసోహం
ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటు పరం
నిలదీయాలి వీరిని ఈ క్షణం
విద్వేషాలతో కార్మిక ఐక్యతకు నష్టం
ఇకనైనా స్పందించాలి ప్రభుత్వం
నిలబడదాం అందరం కార్మికుల పక్షం
సార్వత్రిక సమ్మెకు చెబుదాం సంఘీభావం
- శరత్ సుదర్శి
7386046936