Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనువు మైల పట్టినా
తేటతెల్లం లాంటి మనసు
గొడ్డు కష్టాన్నే నమ్ముకుంటది
కష్టమొస్తే కార్మికుడు
యాధికొస్తడు
ధైర్యం కొసం
వాళ్ళనే దేవుడని చూపుతవు
మరీ
కార్మిక సేవలకు
అడ్డుకట్టైతవూ.,
ఎందుకని దొర..?
పెత్తనం ఇచ్చింది
నీ చెంచాగాల్లకు
మా ఒంట్లో సత్తువని
దోచి పెట్టడానికి కాదు..
పనినే బానిస చేసి
కాలానికి కిరీటం పెట్టీ
కష్టాన్ని దోచుకునే హక్కు
ఎవ్వడిచ్చిండు నీకూ..?
శ్రమని బలిదానం చేసే
కార్మికుల జీవితంలో
వాళ్ల
వెన్నుపూసలని లాగే
నీచపు బుద్ది
ఎందుకు నీకు.. ?
వెంటరాని పదవికి ఆరాటం
ఎందుకు..?
కడ వరకు చెంతనుండే
మనో:నిబ్బరానికి
మగ్గెం ఎందుకు..?
లాక్కున్న చెమటను
కార్పొరేటర్ల కంపెనీలకు
ఊడిగం చేయడానికా..?
ఇటుకలతో గూడు కట్టే
భవన కార్మికుడు
రాజకీయ సమాధులు పేర్చడానికి
తెగించి కూసొడంటావా..?
చాయి చుక్కల కంటే
నీచమైనవా.,
పేదోడి చెమటలు
సెమట సుక్కలకు
అడ్డుపడుతున్న నీ తేనీరు
వాటిలో కలిసి
ఆహూతి కావలసిందే..
గాయాలపాలైన ప్రమిదలు
ఉప్పగానే ఉంటూ
మంటలను రగల్చగలవూ.,
పోగలతో గుమి గుమ్మగలవూ..!!
- తాళ్ళపల్లి శివకుమార్
మీదికొండ, స్టేషన్ ఘనపూర్
9133232326.