Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రగతి పథ రథశోధకులు
విశ్వ కార్మిక శ్రామికులు
శ్రమ శక్తుల నమ్ముకొన్న
దేశ భవితకు పునాదులు !!
రుధిరము సలసల మరుగును
స్వేదము గతిలగ పారును
జీవితాంతం కార్మికుల
కష్టం కడలిగ మారును !!
పెనేసి నరాలు తనువున
ముడేసి ప్రేవులు పొట్టన
అర్దాకలితో నిత్యము
బ్రతుకుల మూటలు నెత్తిన !!
కార్మికుల దేమి పాపము
ఎప్పుడు తీరును శోకము
కష్టాల గుర్తింపుతో
ఎప్పుడు మారును లోకము !!
చేయు చేయి కలుపుము
ఒకటిగా నిలబడుము
గడ్డి పరక లేకమవగ
బంధి యగు మదగజము !!
కలిసి నడువు ఐక్యతకై
సైరనూదు సమ్మెకై
శ్రామికుడా నడుము గట్టు
నీ హక్కుల సాధన కై !!
పోమాల హన్మంతు
మహబూబ్నగర్
చరవాణి= 9989934521