Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రమయే ఆయుధంగా
చెమట లే ఇంధనం గా
కృషి నే ముడిసరుకుగా
కష్టాలనే పునాదిగా
మార్చి నిరంతరం గా
అహర్నిశలు అవిశ్రాంతంగా
శ్రమిస్తున్నాడు శ్రామికుడు
నిరంతరంగా
మారుసతాడు కండలను పిండి గా
చేస్తాడు గుండెను బండగా
నిలుస్తాడు ఆపదలో కొండలా గుర్తించకపోతే శ్రమంత దండగ
రాట్నం లో దూదిలా
యంత్రంలో చక్రంలా
పగలైతే సూర్యుడిలా
నిశి లో చంద్రుడిలా
ఒదిగి పోతాడు అన్ని వేళల
ఎత్తుపల్లాలను అధిగమిస్తూ
ఒడిదుడుకులను ఎదిరిస్తూ
ఓటమిగెలుపులనుఆస్వాదిస్తూ
మలుపులను గెలుపు గా మారుస్తూ
ముందుకు సాగి పోతాడు మౌనంగా
గాలిలోని ప్రాణ వాయువుల లా
తిండి లోని గ్లూకోస్ లాగా
ఉండే ఇంటిలోని ఇటుకల
నడిచే వాహనంలోని ఇంజన్ లా
సర్వస్వాన్ని ఇచ్చాడు బహుమతిగా
మన జీవితానికి ఆధారంగా
మనం అనుభవించే సుఖాలకు
తన సుఖాన్ని పెట్టాడు పణంగా
తన త్యాగం ఫలితమే నేటి సుఖాలకి హేతువులు
ఎడారి లాంటి తన జీవితంలో
వెలిగిద్దాం ఆశాజ్యోతులను
ఆశిద్దాం ఉజ్వలంగా దేదీప్యమానంగా
నిరంతరంగా వెన్నెలా గెలుపు నిండాలని
*********
అనసూయ ఆకాష్ చౌహాన్
నిజామాబాద్ జిల్లా
9494918680
Email- ranasuya86@gmail.com