Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మె అంటేనే కొన్ని రాజకీయ పార్టీలకు
ప్రభుత్వాలకు చిరాకు
మొన్న తమిళమాత
ఉద్యోగుల సమ్మెపై కర్కశంగా ప్రవర్తిస్తే
నిన్న బెంగాల్ దీదీ ఒక్కరోజు సార్వత్రిక సమ్మెపై
నిర్దయగా నిరంకుశంగా వ్యవహరించినది
సమ్మె అనేదే లేకుంటే
8 గంటల పనివిధానం
ఇప్పటివరకూ అందని ద్రాక్షే అయ్యేది
నిరసన అనేది లేకుంటే
నియంతల పాలనే కొనసాగేది
ప్రతిఘటన అనేది లేకుంటే
ప్రభుత్వాలు ప్రజలకు
జవాబుదారీగా ఉండకపోయేవి
ధర్నాలు ఉద్యమాలు విప్లవాలు
సమాజంలో మౌలిక మార్పుకై
జనహిత రాజ్య స్థాపనకై
ఉనికిలోకి వచ్చినవే
అసంఘటిత కార్మికులు జీతాలు పెంచమన్నా
కాంట్రాక్టు ఉద్యోగులు కొలువులు
పర్మనెంట్ చేయమన్నా
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ జీవితాలకు
దారి చూపమని వేడుకున్నా
సి.పి.యస్ విధానాన్ని రద్దు చేయుటకు
రెగ్యులర్ ఉద్యోగులు అడుగుతున్నా
పరిష్కార దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వాలు
న్యాయమైన డిమాండ్లను పక్కన బెట్టి
వారి జీతభత్యాలు, అలవెన్సుల పెంపుపై
మాత్రమే దృష్టిపెట్టారు
తమ పదవులు ఎలా కాపాడుకోవాలి?
తరగని ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి?
అని మాత్రమే ఆలోచిస్తున్నారు
అన్ని కార్మిక సంఘాలు ఐకమత్యమైతేనే
అమలు జరుగుతాయి కోరికల జాబితాలు
ఇప్పుడైనా ఎప్పుడైనా
అరుణ జ్యోతి, సూర్యాపేట