Authorization
Wed April 02, 2025 01:21:38 pm
మనిషికి అతీతమైనవి
ఈ వ్యవస్థలో కోకొల్లలు!!...
కొన్ని సృష్టికందనివి!!...
మరికొన్ని దృష్టికందనివి!!...
అసలు మనఆలోచనలకే స్ఫురించనివి!!...
ఇలా ఎన్నో..ఎన్నెన్నో!!...
కానీ వ్యక్తి సామన్యుడా!!??...
కాదు..కాదు అసమాన్యుడు!!...
మనసుతో చూస్తున్నాడు...
కర్తవ్యంగా భావించి చేస్తున్నాడు...
యోగదృష్టితో అందుకొంటున్నాడు!!...
తనలోకి జారిపోతూ...
అన్నిటినీ పరికించిచూస్తూ..
తనకుతనే ప్రేరణగా మారుతున్నాడు!!...
ఉన్నతునిగా
మలుచుకొంటున్నాడు!!...
వ్యక్తిగా సమస్తాన్ని ఆవరించేలా
విస్తరిస్తూ ఎదిగిపోతున్నాడు!!...
తనకు తానే ఒకచైతన్యమై...
తనకుతానే ఒక మార్గమై...
తన ప్రవర్తనే తనకు
రక్షణగా మలచుకొని
సాగిపోతున్నాడు!!....
తాను అక్షర యోధుడై
విశ్వాన్ని దర్శిస్తున్నాడు!!...
గాలిలో తేలియాడుతూ...
గగనవీధుల్లో తిరుగుతూ...
నీలిపొరలను తొలుచుకుంటూ...
దూదిపొరలను చీల్చుకుంటూ...
అనుకున్నగమ్యాన్ని... చేరుతున్నాడు!!..
తన లక్ష్యంవైపుగా సాగిపోతున్నాడు!!...
ఈవ్యవస్థకు నిజమైన
మాంత్రికుడు మనిషే!!...
అన్ని యుక్తులున్నాయి...
అన్నీశక్తులున్నాయి...
పడగొట్టగలడు!!...
తెలివితో నిలబెట్టనూగలడు!!...
గాలిని ఆయుధంగా
చేసుకొన్నాడు!!...
నీటిని శక్తిగా... మార్చుకుంటున్నాడు!!...
ప్రకృతిలోని...
సమస్తాన్నికూడా
తన పాదాక్రాంతం చేసుకుంటున్నాడు!!..
అవనిలో దాగిన
సంపదనంతా...
తనవిలాసానికై
వినియోగిస్తున్నాడు!!..
వివేకంతో...
విషయపరిజ్ఞానం పెంచుకొని
విశ్వవిజేతగా నిలుస్తున్నాడు!!... కాలానికి ధీటుగా...
తనకుతానే
సాటిలేని అజేయశక్తిగా...
ఎదుగుతూ ముందుకు దూసుకుపోతున్నాడు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801