Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ నిశ్శబ్దంలోనుంచి
గద్దించే పిలుపు
వినబడుతోంది...
ఎక్కడినుంచో
తెలియదు...
ఇదొక మానవీయ పిలుపు!..
ఈగొంతు ఎవరిపేరుతో
పిలుస్తారో వారికే వినబడుతోంది!..
ఎవరి దారి వారికే కనబడుతోంది!..
ఇది ఎప్పటికీ ఆగని ఒరవడి!...
జీవితానికి ఓ పరమావధి!...
గర్జించే శబ్దం
వెంబడించినట్లు
రారమ్మని
పిలిచినట్లుగా ఉంటుంది!..
ఎప్పటికైనా ఆ పిలుపుకు
శిరసావహించవలసిందే!...
కానీ లోలోపల
దడ మొదలవుతోంది!...
గుండె దడ ప్రారంభమవుతోంది!..
సమాజం చుట్టూ
పెనవేసుకొన్న అనుబంధాలు
తెంచుకోవాలంటే...
కాళ్ళ కింద భూమి కదిలినట్లు...
కాలం తరుముతున్నట్లుగా ఉంది!..
అందరితో ముడిపడిన జీవితాలు...
అన్నీ బంధాలతో అల్లుకున్న
జీవన విధానాలు!...
ఏదో పిలుపుతో
ఎవరికైనా వణుకు పుడుతోంది!...
ఈ పిలుపు
దివ్యత్వం నుండి దైవత్వం
పిలుపులాఉంది!...
చిమ్మచీకటిలో ఏదో
ఊపిరాడకుండా చేస్తోంది!...
ఎటూ కదలలేని దైన్యత!...
ఓ రాకాసి గుహలోకి
ఈడ్చుకు పోయిన్నట్లు...
ఏదో తల్లడిల్లిన్నట్లుగా ఉంటుంది!...
ఆకాశాన్ని చీల్చుకుంటూ...
ఆవేశం అరుపులతో వచ్చినట్లు...
ప్రతి ఒక్కరి జాడవెతుక్కుంటూ
వచ్చిన ఓ పొలికేక!...
పుడమి పొత్తిళ్ళలోకి
పాతుకుపోయిన బతుకులను...
సమాజం గుండెల్లో
పాతుకున్న కాళ్ళను...
హఠాత్తుగా లాగేసుకొని
బలంగా పెకళించి తీసుకుపోవడమే!..
ఎక్కడ దాగినా.. ఏ సందులో దూరినా
వదలిపెట్టని వడుపుతో వచ్చి...
వలవిసిరి లాగేసుకుపోవడమే!...
కాంతి కంటే వేగంగా..
గాలికంటే సులువుగా...
కనబడకుండా వెళ్లిపోతారు!...
ఎందరెందరో ఓ ప్రశాంత
వినూత్న కాంతిలోకి...
ఓ కొత్త శాంతిలోకి వెళ్లారు!...
ప్రణాళిక బద్దమైన పనులను
ధర్మబద్ధంగా నడుచుకొని వెళ్లారు...
అందుకే మహాత్ముల మార్గదర్శనంలో
ఓ వినూత్న జీవనవిధానానికి
ఓ కొత్త నిర్మాణత్మక పునాది వేద్దాం!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801