Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెనుంచి గురిపెట్టి చూస్తే
ఏందరెందరివో గుట్టంతా...
బయటపడుతుంది!...
సుదూరాలలోదాగిన...
అగాధంలో ఇరుక్కున్న...
ఆకాశంలో దాగిన...
అంతరిక్షయానం చేసిన...
అందరి అంతరార్థం
బయటపడుతుంది!!...
ఉబికి వస్తున్న కొత్తకొత్త స్థావరాలు...
దిగివస్తున్న
రూపాంతర వ్యసనాలు..
విసిరేసే విధంగా కలుషితాలు...
పారేసే విధంగా గుండెగురి
పనిచేస్తోంది!!...
మనసువిప్పి మాట్లాడిస్తోంది!
ఇంక ఎక్కడికి వెళ్లగలడు!!??
గుండెనుకడిగి..మనసును తుడిచి
శుభ్రం చేయాలి!...
చూపులతో విసిరే నిట్టూర్పులు
మనసును కరిగిస్తోంది!..
మమతని పూయిస్తోంది!..
రహస్య నిర్బంధాలు రాలిపోతాయి!..
కాస్త వ్యవధితో కాలమే మార్చుతోంది!..
గమ్యం తెలియని గమనం...
గతి తప్పిన స్థితి...
నేటి మనుషుల్లో
జీవంలేని జీవితాన్ని
గడుపుతున్నారు!!...
నిత్యం పొంగుకొచ్చే
కలతల కన్నీళ్ళ అలల
అలుగులెన్నో!!??...
ఏదిఏమైనా
ఉన్నదాని విడిచి
లేని దానికొరకు
ప్రాకులాడుతారు!...
ఎప్పుడైనా..ఎవరికైనా
ఓ దిక్సూచి అవసరం!..
పిడికెడు బరోసా ఇచ్చి..
బతుకును నిలబెట్టాలి!..
చిటికెడు ఆశతో
చిటికెన వేలుపట్టి
నడిపించాలి!!...
ఆత్మీయతతో
గుండెను తట్టాలి!!...
ఆనురాగంతో మనసును
అల్లుకుపోవాలి!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801