Authorization
Wed April 02, 2025 02:26:10 pm
ప్రపంచ ఆధునీకరణం - శ్రామికుడి కృషి నైవేద్యం
శ్రమజీవన సౌందర్యాన్ని ఘోషిస్తున్న ఆర్యోక్తులు
" కృషితో నాస్తి దుర్భిక్షమ్" 'కష్టేఫలే '
జీవన సారాన్ని ఉద్భోదిస్తున్న పరమసత్యాలు
ప్రమాణబద్ధ బతుకులు - ప్రగతి రథచక్రాల ఇరుసులు
శ్రమసౌందర్యం కొందరి ఆస్వాదనకే కాదు - అది సమసమాజ పురోగమనానికి ఒక మూల ధాతువు
శ్రమ విభజనలో లోపించిన
సమరస భావన
వర్గ వైషమ్యాంల విషబీజాలకో సంకేతం
విలాసాల అందలాలు సృష్టించే శ్రమశక్తి
కొందరి సొంతమై విభజన రేఖల్ని గీయరాదు
ప్రకృతి ప్రసాదించిన సకల సంపదలు
కారాదు స్వార్థపూరిత దోపిడి నిలయాలు
కార్మిక స్వేదంలో ప్రభవించిన ఉత్పత్తుల వరాలు
జీవితాల్ని వెలిగించే సంగీత స్వరాలు
కార్పోరేట్ విషకౌగిలిలో నలిగే కార్మిక భవితవ్యం
దోపిడి దోబూచులాటకు ఒక రాచబాట
శ్రమదోపిడి సవాలక్ష రూపాలు జాతీయ అంతర్జాతీయ ఒప్పందాల్ని బలిగొన్న దుర్మార్గాలు
ప్రభుత్వ శాసనాలు లిఖించే సర్వోన్నత లక్ష్యాలు
శ్రమజీవుల భవితకై లక్ష్వించే మార్గదర్శకాలు కావాలి
ఛిద్రమైన జీవితాలు గర్జించే నిరసన ధ్వనులు
గద్దెల్ని కూలదోసే ప్రతిధ్వనులై- వ్యవస్థల్ని సంస్కరించే గుడి గంటలై మ్రోగాలి
శ్రామికుడే సర్వోన్నతుడై సమన్యాయం సాధించాలి
- కె. లక్ష్మణ్ గౌడు,
9704930509.