Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రామికులారా!
త్యాగ జీవులారా!
శ్రమకు తగిన ప్రతిఫలం అందకున్నా
కండలు కరిగి సత్తువ నశించినా
ఛీత్కారాలను సత్కారాలుగా
స్వీకరించి దేశాభి వృద్ధిలో
భాగస్వా మ్యు లై న కార్మికులారా!
ప్రభుత్వం నీ పై అలసత్వం చూపిన
ప్రవర్తిస్తావు భాద్యత గా
అన్నదాతవై ఆదుకుంటావు,
మా కడుపులు నింపుతావు
వస్తూత్పత్తి పెంచుతావు కార్మికుడవై
ఎండనక వాననక పగలు రేయి
కష్టించి పని చేసి తిండి పెట్టే నీవు
వున్ననాడు తింటూ లేనినాడు
పస్తులుంటూ లాగుతుంటావు
జీవిత రధాన్ని అందుకే
ఋణ పడింది దేశం నీ సేవకు
మంచి రోజు లకై ఎదురు చూసే
నీ ఓర్పుకు శతకోటి వందనాలు.
నీ హక్కుల సాధనకై సమ్మెకు దిగావు
నీ శ్రమతో మాలో జీవం పోస్తున్న
నీ పోరుకు తోడు నిలవడం మా కర్తవ్యం
- పి. విజయ లక్ష్మి భవాని
8121493067