Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్మల్ని భయపెట్టాలని
చూడకండి!..
బాధపెట్టాలని...
అనుకోకండి!..
భయం అయినా...
దయ్యమైనా..
మేము ఎటూ...
పారిపోము!..
ఎక్కడికీ...
జారిపోము!..
వీటినన్నిటినీ..
మమ్ములను నిత్యం తరుముతూ
ఆవరించిన దారిద్ర్యమే...
తరిమేస్తోంది!..
మమ్ములను అనునిత్యం
వెంటాడుతోన్న ఆకలి..
వెంబడించి చంపేస్తోంది!..
ఇవే మా బతుకుకు
నిజమైన ఊతం!...
మాగుండెకు ఊపిరి!!...
మా కష్టం మమ్మల్ని
బతికిస్తోంది!..
మాఇష్టం మమ్మల్ని
ఓదార్చుతోంది!..
మా సుఖం మమ్మల్ని
ఇబ్బంది పెడుతోంది!..
అందుకే మేము
సౌఖ్యాన్ని కోరుకోము!...
కష్టం ఎక్కువైనపుడే
బలమైన తెగింపు వస్తుంది!..
కొత్తకొత్త ఆలోచనలు
పుట్టుకొస్తాయి!..
పట్టుదల పెరుగుతుంది!..
అనుకున్న ఆశయం
నెరవేరుతుంది!!...
మాలో లోపాలులేవు!...
మా ప్రయత్నం ఎప్పుడూ
వృధా కాదు!..
మాలోఎప్పుడూ
ఓ రావణకాష్టం
కాలుతుంటుంది!..
అదే...జానెడు
"కడుపులోని మంట"!!..
మా ప్రయత్నం మాదే...
మా ప్రయోగం మాదే...
మా ప్రయాణం మాదే...
మా తపన మాదే...
నిరంతరం తపిస్తాం!...
అనుకున్నది సాధిస్తాం!!...
అప్పుడప్పుడు..
గాయపడుతాం!...
ఆ గాయమే..
ఓదార్పు గేయమై
మాలోని చైతన్యాన్ని
చిగురింపచేస్తుంది!...
మా రాతి గుండెల్ని
వికశింపజేస్తుంది!...
తరతరాల యాతనను
తీర్చుతుంది!!...
రెక్కల కష్టాన్ని..
నమ్ముకున్నోళ్ళం!..
విశ్వాసాన్ని ప్రేమిస్తాం!..
వినయంతో పనిచేస్తాం!..
ఏ పనిచేసినా...
మా గుప్పెడు...
మనసును నిల్పి
తృప్తిపరిచే విధంగా
పనిచేస్తాం!!..
అందుకే కష్టం..మాకు ఇష్టం!!...
పనితోటే జనం!..
పనితోటే బలం!..
పనే బతుకుకు మూలం!!..
కన్నీళ్ళతోనే కళ్ళను తడిపి..
బాధల్ని గుండెనిండా నింపితేనే
మా బతుకుల్లో వెలుగు!!..
ఇక మాకు
భయమెక్కడ!!??...
మా కష్టానికి ఖరీదుకట్టే
కాలమెక్కడ!!??...
కాల్చే ఆకలి...
ఉన్నంతవరకు
తెగించి పనులు
చేస్తూనేవుంటాం!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801