Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వల్లభాపురం జనార్దన
9440163687
అన్నంపెట్టే చెయ్యిని అడుక్కుతినే చెయ్యిగా మార్చడంకోసం
స్వామ్యంతెస్తున్న
కొత్త వ్యవసాయ చట్టాల దగాకోరు తనాన్ని బట్టబయలు చేయడంకోసం
పార్లమెంటును దిగ్బంధనం చేయడంకోసం
రైతన్నల ఆగ్రహ నడక కవాతు
స్వామ్య గాంధారి కళ్ళు తెరిపించడంకోసం అన్నదాతల
పార్లమెంటు ముట్టడి
గొర్రు నాగలి మేడికోలల కవాతు
ప్రజాగ్రహ ధిక్కార పిడుగుల శబ్దాలు వినిపించడంకోసం
కన్యాకుమారినుండి ఢిల్లీదాకా
సాగుతున్న నడక
మేడేను తలపిస్తున్న నడక
కర్షక రుధిరాన్ని పానీయంగా బడాబాబులకు అమృతంగా అప్పనంగా అందిస్తూ
రైతులపట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్న రాజ్యం రెండునాల్కల ధోరణిని ఎండగట్టడంకోసం
సాగుతున్న నడక
చీకటిచట్టాలను
సమాధి చేయడంకోసం
పార్లమెంటును ముట్టడిస్తున్న
ప్రశాంత ధర్మరాజుల ధర్మాగ్రహ దీక్ష
చరిత్ర సాక్ష్యాలను గుర్తు చేస్తూ
సాగుతున్న అవిశ్రాంత కవాతు నడక
ఈ అడుగుజాడలు
పాలక కసాయితనంపై విరుచుకు పడే తూటాలు
ఈ అడుగుజాడలు
కొత్త కార్పొరేటు రైతుఅవతార సంహారంపై అమీతుమీ తేల్చుకునే మట్టిపాదాల నడక
మట్టిహక్కులను నిలబెట్టుకోవడంకోసం సవాలు చేస్తూ పార్లమెంటు నలువైపులకు సాగుతున్న నడక
ప్రజాపక్ష కవుల మేధావుల సామాజిక మార్పు శక్తుల స్ఫూర్తి తో సాగుతున్న రైతు కవాతు
పోరు చరిత్రలో మైలురాయి