Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరత్ సుదర్శి
నగర ఓటరు మహాశయులకు
ఇవే నా వందనాలు
మన భవిష్యత్తును
నిర్ణయించేను ఈ ఎన్నికలు
నోట్ల కట్టలతో మీ ఇంటికి
రాబోతున్నారు గల్లీ లీడర్లు
బిర్యానీలకు మందు సీసాలకు
మార్చుకోవద్దు మీ నిర్ణయాలు
రెచ్చగొడతారు కొందరు
ప్రాంతీయ విద్వేషాలు
ఇస్తారు కొందరు అమలుకు
నోచుకోని హామీలు
చేస్తారు ఇంకొందరు
మత రాజకీయాలు
వారి మాయలో పడి
ఓటు వేయక చేయకండీ
ఇంట్లో కాలక్షేపాలు
వెతకండీ దొరుకుతారు
నిత్యం మనకై తపించే పార్టీలు
వారే నిజాయితీగా
మనల్ని పాలించే వామపక్షాలు
నిలబెడదాం ఆ అభ్యర్థులను
ముందు వరుసలో
నిలిచేది వారే కష్టాల్లో మన తోడు
విజయాన్ని అందిద్దాం వీరికే
కాస్త ఆలోచించి అడుగులు వేద్దాం
మన సత్తా ఏమిటో చాటుదాం
ఓటు వేయబోతున్న
శ్రామికులకు లాల్ సలాం