Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ సంపదకు మూలం శ్రామికులు.
శ్రామికుల శ్రమతోనే ఉత్పత్తులు పెరుగుతున్నాయి.
కార్మిక చట్టాలు అండగా ఉన్నాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంది.
నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి,
కార్పోరేట్లకు సౌకర్యంగా కేంద్ర ప్రభుత్వం తివాచీలు.
నియంతృత్వపు పడగ మీద నినాదాలు.
వేడినెత్తురు మరిగినపులి పాలక స్వభావం.
ఓట్లతో సింహాసన మెక్కిన పాలకులు.
ఎన్నికల గారడి ఓటు బ్యాంకు భద్రం.
ప్రపంచీకరణ బాటలో నడుస్తున్న పాలకులు.
పాలకులకు పట్టని రైతు సంక్షేమం.
పథకాలు శీశ్ మహల్.
ఏసి గదుల్లో ప్రగతి గణాంకాలు.
నేటి పాలనలో నిజం మాట్లాడితే,
నేర మంటది ,దేశద్రోహమంటది,
భావస్వేఛ్ఛ బతుకొద్దంటది.
ప్రశ్నలేని సమాజం - ప్రాణం లేని శరీరంలాంటిది.
ప్రశ్నను సహించలేని రాజ్యం - రాబందుల పాలబడ్డ - స్మశానం లాంటిది.
ఉద్యమాలు ఎగిసిపడితే ,
రాజకీయ పునాదులు పెకిలిస్తాయి బీటలు,
పాలన సమాధి చేస్తాయి.
నువ్వెంత సముద్రంలో ఇసుక రేణు వంత,
కొట్టుకు పోవాల్సిందే.
కార్పోరేట్లను తుంచు,ప్రజాస్వామ్యాన్ని గౌరవించు.
పోరాడితే పోయేదేమీలేదు అలసత్వం తప్ప.
ప్రపంచ విజేతగా నిలిచిన ఉదయ భాస్కరులు.
శ్రమ శక్తిని పట్టం గట్టిన కార్మికులు
మండుతున్న ఎర్ర సూర్యులు.
ఎం.డి. ఖాజామైనద్దీన్
మహబూబ్ నగర్.
9396626276.