Authorization
Wed April 02, 2025 10:29:58 am
నాడు కన్యాశుల్కంపై
నీవు సాగించావు పోరు
నేడది రూపు మార్చుకొని కట్న రక్కసై
వనితల్ని వేధించుకు తింటుంది చూడు!
బాల్య వివాహాలు పాపమంటూ
వాటిని నిషేదించ యత్నించవు నీవు
నేటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుపుతూ మా ఘనతను
మేమే చాటు కుంటున్నాం చూడు!
దేశమంటే మట్టికాదు
మనుష్యులన్నావు నీవు
ఆ. మనుష్యులే మానవతా రహితులై
తీవ్రవాదులుగా మారుతున్న వైనం చూడు!
ఆడవారి అభ్యున్నతికి పాటుపడ్డావు నీవు
ఆడ వారి పుట్టుకనే స్కానింగ్‌తో
అడ్డుకుంటున్న మమ్మల్ని చూడు!
ఓ. గురుజాడా!
చూస్తూ ఊరుకోకు
మళ్ళీ పుట్టు
మానవతకు బోణి కొట్టు!
ఆళ్ల. నాగేశ్వరరావు
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
7416638823
ఇమెయిల్ : allanageswararao1965@gmail.com