Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకే...
పటుక్కున పండు వలిగి
ఇత్తులు ఎగజల్లినట్టు
ఇంత ఈసీగా లేదు.
కటిక నేలను, కర్కష రాళ్లను
చిల్చుకొని చిగురించాలి.
ఎండిన బండల్లో
సైతం ఏ మాత్రం
స్పందన తడి తగిలితే
సారమంతా లాగుతున్న
సమాధి చేసే యత్నాలని
తప్పించుకొని సత్యమై
సవాలు చేస్తూ నిలవాలి.
మొలకెత్తగానే కాదు
మొద్దుబారిన మెదల్ల
మొదల్లు,మూలాలు
కదిలించి, కట్టిపడేయాలి
నిజమనే నీళ్లు తాగుతూ
నిలదొక్కుకోవడానికి
మూలకేషాలతో మట్టిని
పట్టుకొని చుట్టుకోవాలి
చుట్టరికం పెట్టుకోవాలి
ఎదిగినంత లోతుగా
శాఖోపశాఖలై విశాలమవ్వాలి.
అప్పుడు
నిప్పు లాంటి నిజాలు
సమాధి చేయబడ్డ సత్యాలు
సంతులిత ఫలాలుగా
సమాజానికి సత్తువనిస్తాయి
ఎన్నో జీవిత పాఠాలు నేర్పే
పతులమ్మలా ఎదిగేది
పచ్చని చెట్టు ప్రగటికి మెట్టు.
- వి. పద్మ
హైదరాబాద్.