Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోట్లతో ఓట్లు కొని కోట్లు సంపాదించే
రాజకీయ రాబందులు
రాజ్యమేలుతుంటే
సామాన్యుని రక్తపు చెమట కు
విలువకట్టే విధ్యులేవరు, ఆధ్యులేవరు.
రాజకీయాలు రాజకీయ నాయకులు
పార్టీలు పార్టీల నాయకులు
అందరూ ఒక తాను ముక్కలే
ఎన్నికల ముందు నినాదాలకు
ఎన్నికల తరువాత విధానాలు
అన్నీ కలలు కల్లల్లే అవుతున్నాయి
అందరి నోట అభివృద్ధి మాటే
అధికారం వచ్చిన తర్వాత అంతా మూటలే
అధికారం వ్యాపారమైతే
అభివృద్ధి కుంటు పడదా
నొట్ల కు బానిసలను చేసి
ఓట్ల ను దండుకుని
దర్జాగా ఐదు వసంతాలు
దావతులో మునిగి పోయే
నాయకులకు న్యాయమేక్కడిధి
మన చైతన్య రాహిత్యం వల్లనే
మన నెత్తిన కూర్చొని స్వారీ చేస్తున్నారు
జపించేది మాత్రం జన ప్రయోజనం
తపించేది మాత్రం వారి ప్రయోజనం
దొంగలు దొంగలు ఊళ్లు
పంచుకున్నట్లుంది రాజకీయం
మనం మారనంత వరకు
మనల్ని మారుస్తూనే వుంటారు
పరిస్థితులు మారవు
మనం మారాలే
ప్రజా ధనాన్ని సంపాదించి
ప్రజలను అడుక్కునెలా చేసింది వ్యవస్థ
కాకులను కొట్టి గద్ద లకు పెట్టినట్లుంది.
ధేశిని శ్రీధర్
వరంగల్ అర్బన్
984818284