Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డా.కందేపి రాణీప్రసాద్.
తలుపు చప్పుడై పేషెంట్ లోపలికి వచ్చిన శబ్దం విని ఏమిటి ప్రాబ్లమ్ అడిగాడు డాక్టరు తలవంచుకుని రిపోర్టులు పరిశీలుస్తూ నికిటికికున్న 'స్క్రూ మింగేశాడు' సార్ నిదానంద చెప్పింది తల్లి 'ఏమిటి' తల ఎత్తి మళ్ళీ అడిగాడు డాక్టరు 'అవును సార్! స్క్రూ మింగి మూడు రోజులయింది' అన్నది తల్లి.
'మూడు రోజుల క్రితం స్క్రూ మింగితే ఇప్పటి దాకా ఎందుకు ఆసుపత్రికి ఎందుకు రాలేదు?' ఆశ్చర్యంగా అడిగాడు డాక్టరు. నిఏముంది సార్! తెల్లారి మోషన్ పోయినప్పుడు వచ్చ్స్థున్న్ది గదా! అన్నది మూడు రోజులయింది ఇంకా బయటకు రాలేదు. అందుకే ఆసుపత్రికి వచ్చానుు చాలా మామూలుగా చెప్పిందామే.
పేషెంట్లు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో డాక్టరుకు తెలుసు కాబట్టి ఏమి మాట్లాడకుండా నిఇదిగోమ్మా! ఎక్స్ రే తీయించుకుని రండి చూద్దాంు అని చెప్పి పంపాడు డాక్టరు.
ఒక అరగంట తర్వాత మరలా లోపలికి వచ్చారు ఆ తల్లి బిడ్డా ఎక్స్ రే చూశాడు డాక్టరు. అందులో ఇనప స్క్రూ చక్కగా కనిపిస్తున్నది. కానీ పేగుల్లోకి చొచ్చుకోనిపోయి ఉన్నది. ఇది మామూలు మేకు కన్నా ప్రమాదకరం. దీనికి చుట్టూ పదును వలయాలుంటాయి. అందుకే అది పేగుల్నీ కోసేసుకోని లోపలికి పోయింది. మేకు గుచ్చుకున్న దగ్గర పేగుకు రంధ్రం పడిపోయింది. అక్కడంత వాపు వచ్చేసింది. ఇక దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. 'మనసులో ఆలోచించుకుంటూ పిల్లాడి వంక చూశాడు డాక్టరు. ఐదారెళ్ళుంటాయేమో! ఇంత చిన్నవాడికి ఆపరేషన్ చెయ్యాలి. ఏదైనా వ్యాధికి ఆపరేషన్ చేయటం వేరు. నిర్లక్ష్యంగా ప్రమాదం తెచ్చుకుని ఆపరేషన్ చేయాల్సి రావటం వేరు ఆలోచిస్తూ డాక్టరు పరిస్థితిని వాళ్ళకు వివరించాడు.
అప్పుడు భయపడింది తల్లి సార్! ఆపరేషన్ చెయ్యాలా ప్రమాదమేమన్న ఉంటుందా. ఈ పిల్లవాడు చాలా అల్లరి. ఒక్కక్షణం ఒక్క చోట నిలవాడు. మేమిద్దరం చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం. బాబును పెద్ద స్కూల్లో చదివించాలనుకుంటున్నాం నిఏడుస్తూ చెప్తోంది తల్లి.
డాక్టరు సావధానంగా చెప్పాడు 'చూడమ్మ పిల్లలు చిన్నగా ఉన్నపుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఏవో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తర్వాత ఇందాక మీరు చెప్పినట్లు మింగిన ప్రతి వస్తువు నేరుగా మోషన్లో బయటకు రాదు ఏదైనా వస్తువు మింగితే తేలిగ్గా తీసుకోకూడదు. జీర్ణాశయంలో గాని, పేగుల్లో కానీ ఇరుక్కుపోతే ఒక్కోసారి ప్రాణలే పోవచ్చు. మూడు రోజుల దాకా ఆసుపత్రికి రాకుండా ఇంట్లోనే ఉన్నారే! ఇదేనా పిల్లల్ని పెంచే పద్దతి. ఇప్పటి తరానికి కెరీర్ మీదున్న శ్రద్ద పిల్లల మీద ఉండటం లేదు'.
డాక్టరు గారు! మా బాబు ప్రాణాలు కాపాడండి నిఏడుస్తూ చేతులు జోడిచింది. 'ఆపరేషన్ చేసి మేకు తీసేస్తాం గాని ఎప్పుడు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి' చెబుతూ ఆపరేషన్ థియేటర్ వైపుకు వెళ్లిపోయాడు డాక్టరు.