Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది అత్యంత కీలక దినం
విజ్ఞత ప్రదర్శించాల్సిన క్షణం
నిబద్ధత రూడి చేయాల్సిన ఘట్టం
నిన్ను నువ్వు నిలబెట్టుకునే తరుణం
మొత్తంగా నీకిది విషమ పరీక్షా సమయం
నిన్నటి దాకా...
రాజకీయ నేతల నోట
ఊకదంపుడు మాటలు ...
సంక్షేమ గీతాలాపనలు ...
వాగ్దాన పద ప్రయోగాలు ...
హామీల మంతోత్సరణలు ...
సవాళ్లు ప్రతి సవాళ్ళ విసుర్లు ...
విధ్వేసాలు రెచ్చగొట్టు పలుకులు ...
ఉత్తర కుమార ప్రేలాపనలు విన్నావు
అదే తీరుగా ...
కరెన్సీ పంపక క్రతువులు
మద్యం ఏరుల ప్రవాహాలు
కుల సమీకరణ కుయుక్తులు
విందు,వినోదాల ధరహాసాలు
బహుపాత్ర నాటక ప్రదర్శనలు
బహిరంగ సభలు,పాద యాత్రలు
చిత్ర విచిత్ర దృశ్యాల తిలకించావు
ఓటు అస్త్రధారుడా !
ఎన్నికల సమరాంగనంలో
ప్రధాన పా(సూ)త్రధారివి నువ్వే
ఇపుడు
బుద్ది కుశలత ప్రదర్శించి
సంక్షేమం కోసం పాటుపడే...
ప్రగతి పదం వైపు నడిపించే...
ప్రజల కోసం బతుకు దారబోసే....
నీతివంతమైన నేతకు పట్టం గట్టు
ప్రజాస్వామ్యన్ని పదిలంగా నిలబెట్టు.
- సబ్బు నాగయ్య,
9573996828