Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులు రెండురకాలు
ఒకరు "మరణించినవారు
మరొకరు "మరణించబోతున్నవారు" అంటూ
కనుమరుగైపోయిన "సాహితీశిఖరం" దేవీప్రియ
వారు భౌతికంగా లేదన్నది "పచ్చినిజం", కానీ
వారు మరణించారన్నది "ఒక పచ్చిఅబద్ధం"
దేవీప్రియ మరణంలేని మహా "కవిదిగ్గజం"
వారు ఎందరికో ఆదర్శం ఎందరికో "మార్గదర్శి"
వారందరికీ "ఆత్మీయబంధువు" "ఆజాతశత్రువు"
ఇందరి ఆశిస్సులున్న ఇందరి ఆయుష్షు
పోసుకున్న దేవీప్రియకు ఇక మరణమెక్కడిది ?
కవిత్వాన్ని కలగన్నవాడు
కవిత్వాన్ని కలవరించినవాడు
కవిత్వమే తన ఊపిరిగా భావించినవాడు
కొత్త ప్రపంచాన్ని, నిష్కల్మషమైన నేతలుండే
ఒక నూతన సమాజాన్ని కోరుకున్న "సమతావాది"....
దేవీప్రియ ఎవరీనీ దేహీ అనలేదూ దేనినీ వదలలేదు
వారి కవిత్వం ఎంత సుతిమెత్తనో ఎంత సుకుమారమో
అంతే పదునైనది...చురకత్తిలా...
చుట్టుముట్టి ముంచేస్తుంది... సునామీలా...
బ్రద్దలై లావాను విరజిమ్ముతుంది... అగ్నిపర్వతంలా...
దేవీప్రియ "సముద్రమై ఉప్పొంగినవాడు"
భగభగమండే "సూర్యున్ని దిగమింగినవాడు"
అక్షరాలతో ఆటలాడుకున్న దేవీప్రియ
ఒక "విజ్ఞానగని" విశిష్ట వినూత్న "పదాల సృష్టికర్త"
కవిత్వంతో వారు కళ్ళు తెరిచే వుంటారు
కవిత్వంతో రోజుమనతో మాట్లాడుతూనే వుంటారు
కవిత్వంతో మనకు నిత్యం దర్శనమిస్తునే వుంటారు
కడలిలో అలలు ఆగితేనే...
సూర్యుడు పడమర ఉదయిస్తేనే...
నింగిలో నక్షత్రాలు నేలరాలితేనే...
సప్తసముద్రాలు ఎండిపోతేనే...
మహాకవి దేవీప్రియ మరణించినట్లు...
అందుకే దేవీప్రయకు "మరణం" లేదు
కవిత్వం నుండి వారిని "ఏ మృత్యువు" వేరుచేయలేదు
మరణంలేని మహాకవి...దేవతలదరి చేరిన దేవీప్రియ...
వారు సాహితీ క్షేత్రంలో రోజూ పండే "పచ్చనిపంట"
కవులెందరికో "స్పూర్తిప్రదాత" ఆరకరగిలే ఓ"అగ్నిజ్వాల"
వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ....
అశ్రునయనాలతో అందిస్తున్న "అక్షరనీరాజనం"
-పోలయ్య కవి, హైదరాబాద్.
9110784502