Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరినీ తన హృదయంలోకి
అక్కున చేర్చుకునే...
ప్రకృతి ఒడిలో ఒదిగిన
ఓ అందమైన ఆకారం!!...
అన్నికళలతో నిండిన
కావేరి కుటీరం!!...
విశాలమైన మనసు
తన ఒడిలో
పసిపాపలను చేసి ఆడిస్తోంది!!...
చిగురించే జ్ఞాపకాల దొంతరలలో.. జోలపాటలతో..జోకొడుతోంది!!...
కవులకు..కళాకారులకు
చెరగని చిరునామా..
ఈ కుటీరం!!....
అన్ని చిక్కులను..
మనసులోని చికాకుల్ని..
దూరం చేస్తోంది!!....
చరిత్రకు అందని
కథలను వినిపిస్తోంది!!...
వెన్నెల నవ్వులను
పూయిస్తూ...
సుమపరిమళాలను
కురిపిస్తోంది!!...
మనసులోని వేదనలను
తరిమికొట్టే...
జీవన వసంతమవుతోంది!!...
అందరినీ సేదతీర్చి
ఆహ్లాదపరుస్తోంది!!....
అందరినీ పెద్దమనసుతో
పెద్దరికంతో ఆశీర్వదిస్తోంది!!...
జీవితానికి ఓ వసంతమై
పచ్చగా బ్రతకమని..
ప్రబోధిస్తోంది!!...
కవులకు ప్రకృతి ప్రసాదించిన కుటీరం..
తాత్విక రెమ్మలతో విరజిల్లుతోంది!!....
కవితా కొమ్మలతో విస్తరిస్తోంది!!...
అక్షరాలకు హారతిపట్టి
ఆకాశమంత యెత్తులో
నిలబెడుతుంది!!...
మనతో జతకట్టి
అందరినీ జాగృతం చేస్తోంది!!...
అమ్మంత వాత్సల్యంతో
ఆదరిస్తోంది ఈ..కుటీరం!!...
మన అందరికీ
ఆరోగ్య వరప్రదాయిని!!...
జీవిస్తున్నాం అన్నీకోల్పోయి!!...
పోగొట్టుకొంటున్నాం..
ఏదోఆశతో
ఏదో పొందడానికి...
కళ్ళకు కనిపిస్తోన్న పూలదారిని వదలి!!...
కళ్ళకు కనిపించని
ఏదో రహదారి కొరకు
ఎదురుచూస్తున్నాం!!...
మనచుట్టూ ఏదో
జడీభూతం ఆవరించింది!!....
కొత్తదారి కోల్పోతున్నాం!!..
ప్రభావితం చేసే
ప్రభాకరుని వదిలేస్తున్నాం!!...
అందుకే అమావాస్య
చీకటి ఆవరిస్తోంది!!...
ప్రేమతో పిలిచే వారిని
ఆత్మీయంగా పలకరించే
వారిని వదులుకోవద్దు!!...
కూతపెట్టుదూరంలో
ఉన్న కుటీరాన్ని విడువొద్దు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801