Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ ఆనకట్టలు వెలిసినా…
మునిగేది మా ఆధరువులే…
ఏ మైనింగ్ భూతం ఒళ్ళు విరిసిన
కుప్పకూలేది మా బతుకుదెరువులే
ఏ ఆక్రమణదారుడు అడుగేసినా
కరిగిపోయేది మా అటవీ భూములే...
అడవి తల్లిని నమ్ముకునోల్లం
పోడు ఎవుసం చేసుకునేటోళ్లం
అటవీ సంపదకు అసలు వారసులం
రక్తం రుచి మరిగిన రాక్షస రాజ్యం
బూటక చట్టాలకు రూపద్దుతుంది
అటవీ సంపద అప్పనంగ కాజేసి
కార్పొరేట్లకు ధారాదత్తం జేస్తుంది
పచ్చటి అడవిని దురాక్రమిస్తుంది
అమాయక బతుకుల కూలుస్తుంది
అక్రమ గెంటివేతలకు పూనుకుంది
ఆదివాసీ హక్కుల హరించివేస్తుంది
ఈ రాక్షస క్రీడ మానకుంటే ..
ఈ విధ్వంస కాండ వీడకుంటే ...
చిగురుటాకులు ...
చుర కత్తులై విచ్చుకుంటాయి
గడ్డి పరకలు ...
గండ్ర గొడ్డల్లై పదునెక్కుతాయి
చలి చీమలు ...
అగ్ని క్షిపణులై జ్వలిస్తాయి
తూనీగలు ...
తిరుగుబాటు జెండానెత్తుతాయి
నల్ల పిట్టలు
ఉద్యమ గీతాలు ఆలపిస్తాయి
మన్నెం గూడాలు దండుగట్టి
గెరిల్లా యుద్దానికి సంసిద్ధమౌతాయి
దోపిడీ మూకలు ! ఖబద్దార్. ..!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828