Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో తెలియని నిస్సహాయత...
ఏదో తెలియని అసంతృప్తి...
చెదిరిన స్వప్నాలు...
రాలిపోయిన ఆశలు...
జారిపోయిన సుఖసంతోషాలు!!.
ఆవిరైపోయిన ఆకాంక్షలు...
ఆచరణకు నోచుకోని ఆశయాలు...
కలుషిత మనస్తత్వాలతో
జీవనగమనం అంతా
నిశీధి అలుముకుంది!!...
నేస్తమే!...వాస్తవమని
నమ్ముకున్నా....
తెలియని వైషమ్యమేదో
కొత్తతెరకు దారితీసింది!!...
నేను అనే నిషాలో
నిజం ముసుగేసుకుంది!!...
మనసువిప్పి చూసుకొంటే
నా అన్న భావం నడ్డివిరిగింది!!..
ఓ కల్లోలితం
కంటనీరు పెట్టించింది!!...
నిలదీసి నిప్పుల్ని కక్కిస్తోంది..
గుండెను బద్దలుకొడుతోంది..
నిస్తేజంగా..నిర్వీర్యంగా మార్చింది!!..
ప్రేమతో మాట్లాడినా...
ప్రశ్నలతో ఎదురొడ్డినా...
పరిష్కారం కానరాకుంది!!...
చివరికి నిస్తేజమే మిగిలింది!!..
అలసిసొలసిన జీవితం..
కనిపించని ఆత్మీయతలకై...
కరుణించని కాలానికై...
అర్రులుచాస్తూ జీవితకాలమిలా
"కవితాత్మగా కన్నీరు పెడుతోంది"!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801